నచ్చావులే చిత్రంతో
తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పసుపులేటి మాధవి లత పూర్తిస్థాయి రాజకీయ నేతగా
మారిపోయారు.వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరుగనున్న ఎన్నికల్లో గుంటూరు
పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరపున అభ్యర్థిగా మాధవి లత బరిలో దిగనున్నారు.కొద్ది
కాలం కిత్రం మాధవి లత అనూహ్యంగా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.అప్పటి నుంచి సినిమాలకు
పూర్తిగా దూరమైన మాధవి బీజేపీ పార్టీ నిర్వహించే ప్రతీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ
పార్టీలో ఒక మోస్తరు నేతగా ఎదిగారు.ఈ క్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్
దక్కడంతో మాధవి లత సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.తనకు టికెట్ ఇచ్చినందుకు రాష్ట్ర
బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు,బీజేపీ అధిష్టానికి కృతజ్ఞతలు తెలిపారు.కొద్ది
కాలం క్రితం వెలుగు చూసిన అమెరికా సెక్స్ రాకెట్‌లో మాధవిలత పేరు కూడా వినిపించడం
అనంతరం చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు తనకు ఎదురైన అనుభవాలను
మీడియా ముందు బహిర్గతం చేయడం ద్వారా మాధవి లత వార్తల్లో నిలిచారు.తాజాగా శాసనసభ ఎన్నికల
బరిలో దిగుతూ మరోసారి వార్తల్లో నిలిచారు..