తుమకూరు జిల్లాలోని శిర తాలూకాలోని 4వ జాతీయ రహదారిపై ఉన్న కళ్లంబెళ్ల పోలీస్‌స్టేషన్‌ను దెయ్యాల భయం ఆవహించింది.పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల
ఫుటేజ్లలో వింత ఆకారాలు తిరుతుండడాన్ని గమనించి దెయ్యాలుగా భావిస్తూ భయంతో
వణుకుతున్నారు.సీసీ కెమెరా వీడియోలు, ఫోటోలు ఇప్పుడు టీవీ చానెళ్లలో ప్రసారం కాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కళ్లంబెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ప్రతి రోజూ ప్రమాదాల్లో కనీసం ఇద్దరైనా మృత్యువాత పడుతుంటారు. గతంలో కూడా పలు ఘోరమైన రోడ్డు ప్రమాదాలో కళ్లంబెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి లభించని ఆత్మలు దెయ్యాలై పోలీస్‌స్టేషన్‌లో తిరుగుతున్నాయంటూ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. దెయ్యాలున్నట్లు వదంతులు వ్యాపించడంతో రాత్రి వేళల్లో స్టేషన్ చుట్టుపక్కలకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. రాత్రి వేళల్లో స్టేషన్లో పనిచేయడానికి స్టేషన్ సిబ్బంది కూడా జంకుతున్నారు..