హైదరాబాద్ : దేశంలోనే తొలిసారిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో క్యాష్ అనే నగదు ఉపసంహరణ పథకాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా దేశంలోని 16,500కు పైగా ఉన్న బ్యాంకు ఏటీఎంలలో కార్డు లేకున్నా నగదును తీసుకోవచ్చు. బ్యాంకు డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాం యోనో ద్వారా ఈ లావాదేవీని నిర్వహించవచ్చు. నగదు కావాలనుకునే ఎస్‌బీఐ ఖాతాదారులు ఉపసంహరణకు యోనో యాప్‌పై విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. తదనంతరం లావాదేవీని పూర్తి చేసేందుకు ఆరు అంకెల యోనో క్యాష్ పిన్‌ను సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఖాతాదారుని మొబైల్ ఫోనుకు ఆరు అంకెల రిఫరెన్స్ సంఖ్య ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. పిన్, రిఫరెన్స్ సంఖ్య వచ్చిన 30 నిముషాల్లోగా నగదును ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది