మిట్ట మధ్యాహ్నం పోలీసుపై కాల్పులు

మిట్ట మధ్యాహ్నం పోలీసుపై కాల్పులు

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో మరో
మారు ఉగ్ర వాదులు బరి తెగించారు. షోపియాన్‌ వెహిల్‌ గ్రామానికి చెందిన స్పెషల్‌ పోలీస్‌ ఖుష్బూ జాన్‌ను శనివారం మధ్యాహ్నం ఆమె
ఇంటి ఎదుటే కాల్చి హతమార్చారు.ఖుష్బూ ఇంటి నుంచి బయటకు రాగానే కొందరు ముష్కరులు ఆమెను అటకాయించి
తూటాల వర్షాన్ని  కురిపించి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఖుష్బూ ఆసుపత్రిలో
చికిత్స పొందుతూ  ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.
వెహిల్‌ గ్రామంలో పోలీసులు, భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ముష్కరుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఇటీవల పుల్వామా జిల్లాలో జమ్ము కశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌లో పని చేసిన ఆషిక్‌ హుస్సేన్‌ గత బుధవారం  తన ఇంటి నుంచి బయటకు వస్తుండగా ముష్కరులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయ పడిన హుస్సేన్‌ చికిత్స పొందుతూ ఆసుప్రతిలో మృతిచెందారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos