న్యూఢిల్లీ: పంజాబ్ ఆయుధాల వ్యాపారి అమర్లాల్ నుంచి ఢిల్లీ పోలీసులు శనివారం సుమారు రెండు వేల తూటాలు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్టు చేసి, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అమర్ లాల్ చాలా కాలంగా మారణాయుధాల్ని సరఫరా చేస్తున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని వివరించారు. అధిక సంఖ్యలో తూటాల సరఫరాకు గల కారణం కోణంలో దర్యాప్తు ప్రారంభించామన్నారు.