న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో శనివారం జరిగిన కార్యక్రమంలో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పద్మ అవార్డులను ప్రదానం చేశారు. భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రి, విలువిద్య క్రీడాకారిణి బంబేలా దేవి, బాస్కెట్బాల్ ఆటకు ప్రశాంతి సింగ్ కూడా పద్మశ్రీ అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 25న 112 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలున్నాయి. మార్చి 11న పలువురికి, శనివారం మిగిలిన వారికి అవార్డులను ప్రదానం చేశారు.