తెలుగు రాష్ట్రాల్లో
సంచలనం సృష్టించిన వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపై సినీనటుడు మంచు మోహన్‌బాబు
తీవ్ర దిగ్భ్రాంతి,ఆందోళన వ్యక్తం చేశారు.వివేకానందరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన
అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు.వివేకానందరెడ్డి హత్య తమను తీవ్రంగా బాధించిందన్నారు.ఇదంతా
ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని వీటన్నింటికి ఎప్పుడు పరిష్కారం
లభిస్తుందో తెలియడం లేదన్నారు.కానీ ఈ అరాచాకాలు,ఘోరాలు చేస్తున్న వ్యక్తులను ప్రకృతి,దేవుడు
చూస్తూనే ఉన్నారని ఈ అరాచకాలకు పాల్పడే వ్యక్తులను ప్రకృతి,దేవుడు విడిచిపెట్టరన్నారు.వివేకానందరెడ్డి
ఎంతో మంచి మనిషని కలలో కూడా పరులకు హానీ తలపెట్టడని అటువంటి మంచి మనిషికి ఇటువంటి మరణం
దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి వివేకాను
హత్య చేసిన నరరూప రాక్షసులను పట్టుకొని కఠినంగా శిక్షించాలంటూ కోరారు.కాగా మంచు విష్ణు
భార్య వెరినికారెడ్డికి వివేకానందరెడ్డి పెదనాన్న అనే విషయం తెలిసిందే..