ఫేక్‌న్యూస్‌ నమ్మకండి..నేను బాగానే ఉన్నా ..

  • In Film
  • March 16, 2019
  • 179 Views
ఫేక్‌న్యూస్‌ నమ్మకండి..నేను బాగానే ఉన్నా ..

గతంలో ఎంతో మందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఫేక్‌న్యూస్‌ బాధితుల్లో కమెడియర్‌ కమ్‌ హీరో సునీల్‌ కూడా చేరాడు.కమెడియన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో కెరీర్‌ ప్రారంభించి అనంతరం హీరోగా ప్రయత్నించిన సునీల్‌పై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వదంతులు సునీల్‌ అభిమానులతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమను కూడా కొద్దిసేపు షాక్‌కు గురి చేశాయి.కారు ప్రమాదంలో సునీల్‌ మృతి చెందాడంటూ సామాజిక మాధ్యమాల్లో దావనలంలా వ్యాపించిన వదంతులు అభిమానులు,సినీ జనాలను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి.చాలా మంది నిజంగానే ప్రమాదం జరిగిందా అంటూ ఆరా తీశారు.ఈ వార్తలపై సునీల్‌ ట్విట్టర్‌లో స్పందించాడు.కారు ప్రమాదంలో తాను మృతి చెందినట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని తనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని తాను బాగానే ఉన్నానంటూ పోస్ట్‌ చేశాడు.సందేశంతో పాటు ఫేక్‌ న్యూస్‌కు సంబంధించిన ఫోటో కూడా షేర్‌ చేశాడు.క్షేమంగా ఉన్న వ్యక్తులపై ఇటువంటి ఫేక్‌న్యూస్‌లు రాసి లైకులు,షేర్లు పొందాలనుకునే వ్యక్తులు తాము పోస్ట్‌ చేసే ఫేక్‌న్యూస్‌ల వల్ల అవతల వ్యక్తులు వారి కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో,ఎన్ని ఇబ్బందులకు గురవుతారో క్షణకాలం ఆలోచించుకోవాలి.ఇదే ఘటన మీకో మీ కుటుంబ సభ్యులకు జరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos