వెలింగ్టన్: ఎంతో ప్రశాంతమైన దేశంగా పేరుగాంచిన న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల వద్ద శుక్రవారం ఉదయం దుండగులు కొందరు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 49కి పెరిగింది. ఇరవై కంటే ఎక్కువ మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇస్లామిక్ దేశాల్లో ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కాల్పుల కారణంగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య న్యూజీలాండ్‌లో జరగాల్సిన మూడో టెస్టును రద్దు చేశారు.