క్రికెటర్లకు భాజపా గాలం

  • In Sports
  • March 15, 2019
  • 205 Views

ఢిల్లీ :  లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా భాజపా మాజీ
క్రికెటర్లకు గాలం వేస్తోంది. అయితే ఇప్పటి వరకు వారెవరూ ఆసక్తి చూపలేదు. మాజీ డాషింగ్‌
ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేయాలని కోరగా, వ్యక్తిగత కారణాల
వల్ల అతను తిరస్కరించారని పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడొకరు తెలిపారు. అయితే తాను
ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని వీరూ ఖండించాడు. 2014లో కూడా
ఈ విధంగానే ప్రచారం చేశారని పేర్కొన్నాడు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని తేల్చి చెప్పాడు.
మరో మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం
జరిగింది. అతనూ దీనిని ఖండించాడు. అవన్నీ వదంతులేనని, రిటైర్మెంట్‌ తర్వాత రాజకీయ రంగ
ప్రవేశం చేస్తానని జరిగిన ప్రచారంలో కూడా నిజం లేదని తేల్చి చెప్పాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos