న్యూజిలాండ్‌లో మసీదుల్లో కాల్పులు: పదుల సంఖ్యలో మృతి

న్యూజిలాండ్‌లో మసీదుల్లో కాల్పులు:  పదుల సంఖ్యలో మృతి

వెల్లింగ్టన్‌:
న్యూజిలాండ్‌ క్రైస్ట్‌చర్చ్‌ నగరంలోని శుక్రవారం రెండు మసీదుల్లో
గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపటంతో కొన్ని పదుల మంది మృత్యు వాతపడినట్లు
భీతిల్లుతున్నారు. నల్లరంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి తొలుత అల్‌ నూర్ మసీదులోకి
చొరబడి విచక్షణా రహితంగా జరిపిన కాల్పులకు 27 మంది మృతి చెందినట్లు మాధ్యమ సంస్థలు
అంచనా వేసాయి. ఆ అక్కడ అప్పుడు దాదాపు 300 మంది ప్రార్థనలకు సిద్ధ మవుతున్నట్లు
తెలిసింది.  దాడి జరిగినపుడు బంగ్లాదేశ్‌
క్రికెట్‌ జట్టు సభ్యులు కూడా మసీదులోనే ఉన్నారు. అదృష్టవశాత్తు వారంతా ప్రాణాలతో
బయట పడ్డారు.  ఈ దుర్ఘటన సంభవించిన కొంత సేపటికే  లిన్‌వుడ్‌ మసీదులోకి ఒంటినిండా ఆయుధాలతో ఉన్న ఓ
వ్యక్తి చొరబడి  జరిపిన కాల్పులకు  పలువురు ప్రాణాలు కోల్పోయారు. దుండగుల కోసం పోలీసులు
గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతనూ
కాల్పులు జరిపాడా? లేదా  దుండగులకు
సహకరించేందుకు  అక్కడకు వచ్చాడా? అన్నది
తెలియాల్సి ఉంది.అల్‌ నూర్‌ మసీదు వద్ద కాల్పులు జరిపిన  దుండ గుడు దాడినంతా  17 నిముషాల పాటు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష
ప్రసారం చేసినట్లు మాధ్యమ సంస్థలు తెలిపాయి. దాని ప్రకారం దుండగుడు ఆస్ట్రేలియాకు
చెందిన బ్రెంటన్‌ టారెంట్‌గా తెలుస్తోంది. కారులో
మసీదుకు చేరుకున్న నిందితుడు కారును బయట పార్క్ చేసి లోపలికి ప్రవేశిం చాడు. అతడి
కారులో మారణా యుధాలు, పేలుడు పదార్థాలు, పెట్రోలు పీపాలు ఉన్నట్లు న్యూజిలాండ్
హెరాల్డ్ పేర్కొంది. సాయుధుడు మసీదులోకి వెళ్లిన వెంటనే విచక్షణ రహితంగా కాల్పులు
జరిపాడని తెలిపింది.  ఈ లైవ్‌స్ట్రీమ్‌
వీడియోను షేర్‌ చేయరాదని న్యూజిలాండ్‌ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఘటనపై
న్యూజిలాండ్‌ ప్రధాని జెసిందా ఆర్డెర్న్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ
చరిత్రలోని  చీకటి రోజుల్లో ఇది ఒకటని,
హింసకు తీవ్రమైన రూపమని పేర్కొన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos