స్టాక్‌ మార్కెట్ల శుభారంభం

స్టాక్‌ మార్కెట్ల శుభారంభం

ముంబయి : వారాంతమైన శుక్రవారం  దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు శుభాల్ని పలికింది. లాభాల
లావాదేవీలు ఆరంభమయ్యాయి. తొలుత సెన్సెక్స్‌ 165 పాయింట్లకుపైగా లాభపడగా నిఫ్టీ
11,400 మార్క్‌ వద్ద సంచరించింది. ఆటో, ఐటీ, ఎనర్జీ, బ్యాంకింగ్‌, ఇన్‌ఫ్రా,
ఫార్మా సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండగాఎఫ్‌ఎంసీజీ, లోహ సూచీలు ఒడు దొడుకులకు
గురవుతున్నాయి. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్‌ 255 పాయింట్లకుపైగా లాభంతో తిరిగి
38,000 సూచిక చేరుకోగా నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 11,421 వద్ద ట్రే డయ్యింది.
డాలర్‌తో పోల్చితే రూపాయి బలపడింది. ఏడు నెలల గరిష్టానికి 69.17 వద్ద కొనసాగింది. కోటక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో,
టైటాన్‌ కంపెనీ షేర్లు లాభాల్లో,  హెచ్‌యూఎల్‌, కోల్‌ ఇండియా, జీఎంటర్‌టైన్‌,
భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos