న్యూఢిల్లీ: దేశ చరవాణి విపణిని గుప్పెట్లో బంధించిన చైనా
ఇప్పుడు తాజాగా టెలివిజన్ రంగంపై దృష్టి సారించింది. చైనా సంస్థ-షింకో అతి తక్కువ
ధరల్లో అతిపెద్ద ఎల్ఈడీ టీవీలను విపణిలోకి విడుదల చేసింది. ఎస్ఓ4ఎ 39 అంగుళాల ఎల్ఈడీ
టెలివిజన్ ధర కేవలం రూ.13,990 మాత్రమే. హెచ్డీ
రెసిల్యూషన్ కలిగిన ఈ టీవీలో రెండేసి హెచ్డీఎంఐ, యూఎస్బీ పోర్టులు ఉన్నాయి. 4కె ప్లేబ్యాక్‌కు
సపోర్టు చేస్తుంది. యూఎస్బీ టు యూఎస్బీ ఫైల్ ట్రాన్స్ఫర్, 20 వాట్స్ స్పీకర్,
ఎనర్జీ సేవింగ్ ఫీచర్ ఉన్నాయి. సర్వీసింగ్, ఇన్స్టాలేషన్, మరమ్మతుల కోసం
ఆండ్రాయిడ్ యాప్‌ను కూడా షింకో అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో షింకో ఎల్ఈడీ
టీవీ (24 అంగుళాలు) ప్రారంభ ధర రూ.6,490. 65 అంగుళాల టీవీ ధర రూ.59,990లు.