లోకేశ్ పై పోటీకి ఎన్టీఆర్‌ మామ సిద్దం

లోకేశ్ పై పోటీకి ఎన్టీఆర్‌ మామ సిద్దం

అమరావతి:మంగళగిరి విధానసభ  నియోజక వర్గం తెదేపా అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్‌ పై పోటీకి  హీరో ఎన్టీఆర్ మామ ,వైకాపా కేంద్ర పాలకమండలి(సీజీసీ) సభ్యుడు నార్నె శ్రీనివాసరావు సంసిద్ధత వ్యక్తం చేసారు. మంగళగిరి టిక్కెట్  తనకు కేటాయిస్తే లోకేశ్‌పై తప్పకుండా గెలుస్తానని భరోసా వ్యక్తీకరించారు. ‘చంద్రబాబుకు, జగన్‌కు చాలా తేడా ఉంది.  ప్రజల కోసం  వైఎస్ ఎంతో చేశారు. అందువల్లే నేను జగన్‌కు మద్దతిచ్చినట్లు’ వివరించారు.  హైదరాబాద్‌‌ను చంద్రబాబు అభివృద్ది చేయలేదని మాధ్యమ ప్రతినిధుల సమావేశంలోఆరోపించారు.  తన నిర్ణయంతో నటుడు ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఈ అంశాన్ని ఆయనతో ముడిపెట్టొద్దని కోరారు. జగన్ ఆయనకు టిక్కెట్ ఇస్తారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos