జగన్‌ అక్రమ ఆస్తులకు కెసిఆర్‌ కాపలాదారు

జగన్‌ అక్రమ ఆస్తులకు కెసిఆర్‌ కాపలాదారు

అమరావతి: హైదరాబాద్‌లో వైఎస్ జగన్ కు చెందిన డొల్ల కంపెనీల భూములకు కేసీఆర్ కాపలాదారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధా ప్రాంతాల్లో ఉన్న తెదేపా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ జరిపారు. కర్నాల్ సింగ్ లేఖ రెండేళ్లుగా తొక్కిపట్టడమే జగన్ కు వ్యతిరేకంగా దాఖలైన, అవినీతి,అక్రమాల కేసుల్ని కేసులు నీరు గార్చటంలో భాజపా, వైకాపాల కుమ్మక్కుకు నిదర్శనమన్నారు. రోజు రోజుకూ మోదీ, జగన్లో అసహనం పెరుగుతోందని, ఓటమి భయంతోనే జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారన్నారు. జగన్ దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను గురువారం ప్రకటించనున్నట్లు తెలిపారు. వచ్చే 26 రోజులూ రేయింబవళ్లు కష్టపడి పార్టీ అఖండ విజయానికి కృషి చేయాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos