గత
ఎన్నికల్లో ఎన్నికల నిబంధన అతిక్రమించినందుకు మెగాస్టార్ చిరంజీవిపై నమోదైన కేసును
కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.2014 ఏప్రిల్27వ తేదీ రాత్రి పది గంటల
సమయం దాటాక కూడా కాంగ్రెస్ తరపున ప్రచారరంలో పాల్గొని చిరంజీవి ఎన్నికల నిబంధన అతిక్రమించారంటూ
గుంటూరు అరండల్‌పేటలో కేసు నమోదైంది.ఈ కేసును కిందికోర్టు పరిగణలోకి తీసుకోవడాన్ని
ప్రశ్నిస్తూ చిరంజీవి అప్పటి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.చిరంజీవి ప్రచారాలు
ముగించుకొని తిరిగి వచ్చేశారని మధ్యలో ఎటువంటి ప్రచారాలు చేయలేదని ప్రచారం ముగించుకొని
వస్తున్న చిరంజీవిపై సమయం దాటినా ప్రచారంలో పాల్గొన్నారంటూ అక్రమంగా కేసు నమోదు చేశారంటూ
చిరంజీవి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం చిరంజీవి
తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి టి.రజని కేసును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించారు.ఎటువంటి
వివాదాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఉండే చిరంజీవి ఈ కేసుతో చాలా కాలంగా ఒకింత ఆందోళనలో
ఉంటున్నారు.తాజాగా కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడంతో చిరంజీవికి ఉపశమనం
లభించింది..