ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,337.88 కోట్ల విలువైన నిరర్థక ఆస్తులను వేలం వేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. వేలాన్ని మార్చి 26న నిర్వహించనుంది.100 శాతం నగదు ప్రాతిపదికన వేలాన్ని జరుపుతామని తెలిపింది. నిరర్థక ఆస్తులు:ఇండియన్ స్టీల్ కార్పొరేషన్ (రూ.939 కోట్లు) , జై బాలాజీ ఇండస్ట్రీస్ ( రూ.859 కోట్లు) కొహినూర్ ప్లానెట్ ప్లానెట్ కన్స్ట్రక్షన్ (రూ. 207.77 కోట్లు), మిట్టల్ కార్పొరేషన్ (రూ.116.34 కోట్లు), ఎంసిఎల్ గ్లోబల్ స్టీల్ (రూ. 100.18 కోట్లు), శ్రీ వైష్ణవ్ ఇస్పా ముంబై: త్ (82.52 కోట్లు), గతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ (42.86 కోట్లు). గత వారం రూ.1,307.27 కోట్ల నిరర్థక ఆస్తులను 22న వేలం వేయనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించటం తెలిసిందే. దీంతో వేలం వేసే నిరర్ధక ఆస్తుల మొత్తం వేలం విలువ రూ.3640 కోట్లకు చేరింది.