ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డేనని కాకినాడ ఎంపీ తోట నరసింహం తెలిపారు. బుధవారం ఆయన టీడీపీకి రాజీనామా చేసి భార్య, కుమారుడితో కలసి వైసీపీలో చేరారు. జగన్ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో తాను మంత్రిగా పని చేశానని చెబుతూ, టీడీపీ తన పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించిందని మీడియాతో మాట్లాడుతూ తోట ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో శాసన సభకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరితే చంద్రబాబు పట్టించుకోలేదని, తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు కనీసం పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.