అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి దివంగత పరిటాల రవి తనయుడు శ్రీరామ్ పోటీ చేయనున్నారు. ఇప్పటి వరకు ఆ స్థానానికి ఆయన తల్లి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఆమె సభ్యురాలు కూడా. తమ కుటుంబానికి జిల్లాలో రెండు నియోజకవర్గాలను కేటాయించాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబును కోరనున్నట్లు సునీత బుధవారం తెలిపారు. అలా వీలు కానట్లయితే రాప్తాడు నుంచి శ్రీరామ్ బరిలో ఉంటారని చెప్పారు. చంద్రబాబును గురువారం కలుసుకుని తమ అభ్యర్థనను తెలియజేస్తామన్నారు