టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ రెండవ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది.ఈ సందర్భంగా దర్శకుడుడ రాజమౌళి మీడియాతో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం గురించి మాట్లాడారు.బాహుబలి తరహాలోనే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని కూడా ఏమాత్రం రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నామని ప్రేక్షకులను కట్టిపడేసే కథ,కథనాలు,పాత్రలతో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఉంటుందన్నారు.ఆర్‌ఆర్‌ఆర్ కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేసుకున్న కథతో తెరకెక్కిస్తున్నామన్నారు.ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా థ్రిల్‌కు గురి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం అందరి అంచనాలను మీరి ఉంటుందని బాహుబలి తరహాలోనే ఆర్‌ఆర్‌ఆర్ కూడా ఇండస్ట్రీ హిట్‌గా మిగిలిపోతుందన్నారు. వచ్చే ఏడాది ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు చిత్రవర్గాలు తెలుపుతున్నాయి..