ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మరోసారి తెలుగు ప్రజలను మనసార నవ్వించారు.ఎన్నికల ప్రచారాల్లో భాగంగా తరచూ మీడియా సమావేశాలు,డిబేట్‌లలో పాల్గొనే పాల్ చేసే ఆసక్తికర వ్యాఖ్యలు ప్రతీ ఒక్కరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి.ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి కామెడి షో కొనసాగించారు.మీడియాతో కేఏ పాల్ మాట్లాడిన మాటలు పరిశీలిస్తే ‘కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లడానికి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాను.అయితే అక్కడ నన్ను గుర్తు పట్టిన ప్రజలు నాతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. సుమారు 100 మంది నాతో సెల్ఫీలు తీసుకున్నారు. విమానం ఎక్కిన అనంతరం విమానంలో కూడా కొంతమంది నాతో సెల్ఫీలు తీసుకున్నారు. ఆ సమయంలో నాకు ఇంత ఫాలోయింగ్ ఉందా అని ఆశ్చర్యపోయా.ఒకవేళ నేను కూడా మహేశ్‌బాబులా ఎత్తు,మంచి రంగుతో అందంగా ఉండుంటే నా రేంజ్ మరోలా ఉండేది’.అంటూ కేఏ పాల్ వ్యాఖ్యలు చేశారు.కేఏ పాల్ వ్యాఖ్యలపై మహేశ్‌బాబు అభిమానులు సెటైర్లతో కామెడీషోకి మరింత మసాలాలు అద్దారు.నువ్వు మహేశ్‌బాబు కంటే అందంగా ఉన్నావు. అందులో నీకు దిష్టి తగలకుండా మెడలో నిమ్మకాయలు,ఎండుమిర్చి దండ వేసుకోమంటూ కమెంట్లు పోస్ట్ చేస్తున్నారు..