రేషన్ అక్రమాలకు చెక్..

రేషన్ అక్రమాలకు చెక్..

పేదలు,మధ్య తరగతి ప్రజలకు అందాల్సిన రేషన్‌ సరుకులను పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కుల భరతం పట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.రేషన్‌ దుకాణాల్లో అక్రమాలు జరిగితే సమాచారం ఇవ్వాలంటూ పౌరసరఫరాలశాఖ అధికారులు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి వాట్సాప్‌ నంబర్‌ కూడా అందుబాటులోకి తెచ్చారు.రేషన్‌ దుకాణాల్లో సరుకులను పక్కదారి పట్టిస్తున్నట్లు తెలిస్తే వెంటనే ఫోటోలు,వీడియోలు,ఆడియో క్లిప్పింగులు వాట్సాప్‌ నంబర్‌ 7330774444 కు పంపించాలంటూ సూచించారు.ఈ ప్రయత్నం సత్ఫలితాలనిస్తుందని దీనివల్ల రాష్ట్రంలోని 2.80 కోట్ల మంది నిరుపేద,మధ్య తరగతి ప్రజలకు లబ్ది చేకూరుతుందని పౌరసరఫరాలశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.దీంతోపాటె రేషన్‌ దుకాణాల్లో సరుకుల వివరాలు,దుకాణం ఏ ప్రాంతంలో ఉందో తెలుసుకోవడానికి వీలుగా టీ రేషన్‌ మొబైల్‌ యాప్‌ కూడా పౌరసరసరఫరాలశాఖ అధికారులు అందుబాటులోకి తెచ్చారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos