అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, రాష్ట్ర మంత్రి లోకేశ్ వచ్చే నెల జరుగనున్న శాసన సభ ఎన్నికల్లో విశాక ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు మంగళవారం ఖరారు చేశారు. విశాఖ ఉత్తర టికెట్టును ఆశిస్తున్న వారు చంద్రబాబును కలిసినప్పుడు, అక్కడి నుంచి లోకేశ్ పోటీ చేస్తారని, కనుక సహకరించాలని కోరినట్లు తెలిసింది. మరో వైపు మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ లోక్‌సభ స్థానానికి పోటీ చేయనున్నారు. ఇప్పుడు భీమిలి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఉత్కంఠభరితంగా మారింది. కేంద్ర మాజీ మంత్రి పీ. అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి పేరు వినవస్తోంది.