మహర్షి చిత్రం విడుదలైన వెంటనే అనిల్ రావిపూడితో చిత్రాన్ని పట్టాలపైకి తీసుకెళ్లడానికి మహేశ్‌బాబు నిర్ణయించుకోవడంతో అనిల్ రావిపూడి కథకు సంబంధించి నటీనటుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేశాడు.ఈ క్రమంలో కీలకపాత్రల్లో నటింపచేయడానికి కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్రను సంప్రదించాడు.అయితే అనిల్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు స్వయంగా ఉపేంద్రనే స్పష్టం చేశాడు.తాజాగా తను నటించిన ఓ కన్నడ చిత్రం ప్రమోషన్‌లో మాట్లాడుతూ..మహేశ్ కొత్త చిత్రంలో కీలకపాత్ర కోసం అనిల్ రావిపూడి తమను సంప్రదించారని అయితే అనిల్ అడిగిన్ని డేట్స్ లేకపోవడంతో ఆఫర్‌ను తిరస్కరించామన్నారు.ఈ అవకాశం వదులుకున్నందుకు తమకు కూడా కొంత బాధగానే ఉందని అందుకు మహేశ్‌కు క్షమాపణలు చెబుతున్నామని అవకాశం ఉంటే భవిష్యత్తుల్లో తప్పకుండా మహేశ్‌తో నటిస్తానన్నారు.మరో కీలక పాత్ర కోసం ఒకప్పటి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతిని కూడా అనిల్ సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ప్రచారాల్లో బిజీగా ఉన్న రాములమ్మ అనిల్ ఆఫర్‌కు ఓకే చెబుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న..