ఎన్నికల వ్యయం మోపెడు

ఎన్నికల వ్యయం  మోపెడు

న్యూఢిల్లీ:  దేశంలో ఈ సారి జరగనున్న లోక్‌సభ ఎన్నికలు ప్రపంచంలో కెల్లా అత్యంత వ్యయ భరితమైనవిగా  సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అంచనా వేసింది. వచ్చే నెల 11నుంచి మే 19 వరకూ ఆరు వారాల పాటు జరగనున్న ఎన్నికల్లో అత్యధికంగా రూ.50 వేల కోట్లు (7 బిలియన్ డాలర్లు) ఖర్చు కాగలదని మదింపు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు కంటే ఇది  ఎక్కువ కావడం గమనార్హం. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 6.5 బిలియన్ డాలర్లు ఖర్చయినట్లు  రాజకీయ వ్యయాల నిఘా అంతర్జాల వేదిక – ఓపెన్  సీక్రెట్స్  వెల్లడించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఐదు బిలియను డాలర్లు ఖర్చయినట్లు  అంచనా వేసారు. వచ్చే ఎన్నికల్లో మరో 40 శాతం అధిక వ్యయం జరగనుంది. ‘పెరుగనున్న వ్యయంలో అత్యధిక భాగంసామాజిక మాధ్యమాలు, ప్రయాణ ఖర్చులు, ప్రకటనలకు వెచ్చించనున్నార’ని  సంస్థ అధ్యక్షులు ఎన్.భాస్కర రావు విశదీకరించారు.  2014లో సామాజిక మాధ్యమాల ఖర్చు రూ.250 కోట్లు కాగా ఇప్పుడది ఏకంగా రూ.ఐదు వేల కోట్లకు పెరగ నుందని భావిస్తున్నారు. క్షేఎన్నికల వ్యయం తడిసి మోపెడుఎన్నికల వ్యయం తడిసి మోపెడుత్ర స్థాయి ముఖాముఖి కార్యక్రమాలు, ప్రభుత్వ సమాచారం, ఒప్పందాలు, హెలీకాఫ్టర్లు, ఇతర మోటారు వాహనాల వినియోగాల ప్రాతిపదికన వ్యయాన్ని లెక్కగట్టారు.   

        545 లోక్‌సభ  స్థానాలకు ఎనిమిది వేల కంటే ఎక్కువ మంది  బరికి దిగటం వల్ల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం అభ్యర్థులకు కత్తి మీద సామైంది. నజరనాలు  అభ్యర్థి జయాప జయాల్ని ప్రభావితం చేస్తుందని భావించి అభ్యర్థులు డబ్బు వెదజల్లేందుకు సిద్ధమవుతారని అధ్యయనంలో తేలింది. ఓటర్లకు నగదు, మద్యం సహా ఇతర వస్తువులను పంచాలని కార్యకర్తలు డిమాండు చేసినట్లు తొంభై శాతం మంది రాజకీయ నాయకులు పేర్కొన్నారు. మిక్సీలు, టీవీలతో పాటు చివరికి మేకలను కూడా ఓటర్లకు  గత ఎన్నికల్లో పంచిపెట్టారు. ప్రచార ర్యాలీల వల్లా  పార్టీల ఖర్చు తలకు మించిన భారమవుతోంది. జనాలను ఆకట్టుకునేందుకు బిర్యానీ ప్యాకెట్లు కూడా పంచిపెట్టాలి, బాణసంచా, కుర్చీలు, మైక్రోఫోన్లు, సెక్యూరిటీ, వాహనాలు తదితర ఖర్చులతో అభ్యర్థులకు ప్రచారం పూర్తయ్యేదాకా దినదిన గండమే. ఓటర్లను అయోమయానికి గురిచేసి ప్రధాన అభ్యర్థులకు ఓట్లు పడకుండా అదే పేరుతో పోటీలో నిలిచే మరికొందరు డమ్మీ అభ్యర్థులతో అప్రమత్తంగా ఉండాలంటూ భారత ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. 2014 ఎన్నికల్లో ఒక్కో డమ్మీ అభ్యర్థికి 12 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసినట్లు ఇండియా టుడే అధ్యయనంలో తేలింది.వచ్చే ఎన్నికల్లో రూ.2,600 కోట్లు ప్రకటన కోసమే పార్టీలు ఖర్చు చేయనున్నట్టు జెనిత్ ఇండియా వెల్లడించింది. 2014లో రెండు ప్రధాన పార్టీలు రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్లు  ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఒక్క ఫిబ్రవరిలోనే కేవలం ఫేస్‌బుక్‌లో రాజకీయ ప్రకటనల కోసం రూ.నాలుగు కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos