పవన్‌ కళ్యాణ్‌ తీరని అన్యాయం చేశాడు..

పవన్‌ కళ్యాణ్‌ తీరని అన్యాయం చేశాడు..

ఆంధ్రప్రదేశ్‌
శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఆరోపణలు చేస్తూ
సామాజిక మాధ్యమాల్లో పూనమ్‌కౌర్‌ పేరుతో మహిళ గొంతుతో ఉన్న ఓ ఆడియె టేప్‌ విపరీతంగా
వైరల్‌ అయ్యింది.ఆడియోటేప్‌లో మహిళ చేసిన ఆరోపణలు చూస్తే..పవన్‌కళ్యాణ్‌ వల్ల నాకు
చాలా అన్యాయం జరిగిందని ప్రేమించిన పాపానికి ఇంటికి వెళితే ఇష్టమొచ్చినట్లు కొట్టి
బయటకు వెళ్లగొట్టారని ఆరోపించారు.అయినా నోరు మెదపలేదని నాకు ఐ లవ్‌ యూ చెప్పి మరొక
అమ్మాయితో తిరుగుతూ ఆ అమ్మాయిని గర్భవతిని చేశాడంటూ ఆరోపించింది.నేను నోరు విప్పితే
పవన్‌కళ్యాణ్‌ జీవితం నాశనమవుతుందని పవన్‌కళ్యాణ్‌ రోడ్డుపై నిలబడతాడంటూ ఆరోపించింది.నేను
బయటకు వస్తే జనసేన పార్టీ శాశ్వతంగా మూతపడుతుందని అయితే మిగిలిన హీరోయిన్లలా నేను బ్లాక్‌మెయిల్‌
చేయనని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ఆలోచిస్తున్నానని అందులో పేర్కొన్నారు.
పవన్‌కళ్యాణ్‌ వల్ల నాతో పాటు మరో ఐదారు మంది కూడా మోసపోయారని అయితే తనలా వాళ్లందరూ
ఊరుకేనే అవకాశం లేదని పవన్‌ను చంపేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంటూ ఆడియోటేప్‌లో
ఉంది..

త్రివిక్రమ్‌ విడగొట్టాడు..
పవన్‌కళ్యాణ్‌కు నాకు మధ్య విబేధాలు సృష్టించి దర్శకుడు త్రివిక్రమ్‌ మా ఇద్దరిని విడదీశాడని ఆరోపించింది.పవన్‌ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని పవన్‌తో సంబంధం ఉంటే చాలని అనుకునేదానినన్నారు.పవన్‌ కోసం ఎన్నోసార్లు 51 రోజులు ఉపవాసాలు ఉన్నానని పవన్‌ కూతురు కోసం పూజలు చేశానని పవన్‌ బాగుండాలని కాలినడకన తిరుమల కూడా వెళ్లానన్నారు.వేరే హీరోయిన్లలా డబ్బు కోసమో,అవకాశాల కోసమో రాలేదని పవన్‌ అంటే ఇష్టంతోనే వచ్చారని ఆడియోటేప్‌లో ఉంది.అయితే ఆడియోటేపు శ్రీరెడ్డి అఫిషియల్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో ప్రసారం కావడంతో దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎన్నికల సమయంలో పవన్‌కళ్యాణ్‌ను ఇబ్బందులకు గురి చేయడానికి కుట్రలు చేశారని అందులో భాగంగానే నకిలీ ఆడియో టేపులు సృష్టించి శ్రీరెడ్డితో నాటకం వేయిస్తున్నారంటూ జనసేన కార్యకర్తలు,పవన్‌కళ్యాణ్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos