ఒరు అడార్ లవ్ టీజర్ విడుదలయ్యాక ప్రియ ప్రకాశ్ వారియర్ గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో.అంతలా ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ప్రియ ప్రకాశ్ వారియర్‌పై ఒరు అడార్ లవ్ సహనటి నూరిన్,దర్శకుడు ఒమర్ లులు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.తాజాగా తనపై వచ్చిన విమర్శలపై ప్రియా స్పందించింది. తానుకానీ నోరు విప్పితే చాలా మంది జీవితాలు తలకిందులు అవుతాయని అయితే తనకు ఆ అవసరం లేదని తనపై విమర్శలు,అక్కసు వెళ్లగక్కుతున్న వ్యక్తులకు విధే సమాధానం చెబుతుందంటూ సమాధానమిచ్చింది.అసలు జరిగిందేమిటో చెప్పానంటూ వారి పేరు,ప్రఖ్యాతులు మంటగలసిపోతాయని ఆ సమయం ఎంతో దూరంలో లేదంటూ వ్యాఖ్యానించింది.టీజర్ విడుదలయ్యాక ప్రియాకు వచ్చిన క్రేజ్‌ను చూసి నిర్మాతలు ప్రియా పాత్రలను పెంచాల్సిందిగా డిమాండ్ చేయడంతో ఇష్టం లేకపోయినా నూరిన్ పాత్రను తగ్గించి ప్రియా పాత్రను పెంచానని అందుకే చిత్రం ఫ్లాప్ అయ్యిందంటూ దర్శకుడు ఒమర్ లులు ఓ ఇంటర్‌వ్యూలో తెలిపాడు.ప్రియకు అసలు నటనే రాదని ప్రియా కంటే మరో హీరోయిన్ నూరిన్ చాలా బాగా చేశారని తెలిపిన ఒమర్ ప్రియా నాతో చాలా అమర్యాదగా ప్రవర్తించిందని అందుకే ఇప్పుడు ప్రియాతో తాము మాట్లాడడం లేదన్నారు. అంతకుముందు నూరిన్ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేసింది.ప్రియ వల్లే తన ప్రాత తగ్గిపోయిందని తనకు దక్కాల్సిన పేరు ప్రియా నాశనం చేసిందని ఇకపై ప్రియాతో కలసి నటించనంటూ చెప్పింది.కాగా అప్పట్లో ఆ టీజర్ సెన్సేషన్ అయ్యాక ఒమర్ లుల్లూ ఇంకే సినిమాల్లో నటించకుండా ప్రియా వారియర్ తో అగ్రిమెంట్ రాయించుకున్నాడని దాని వల్లే ఎన్ని ఆఫర్స్ వచ్చినా ప్రియా తిరస్కరించిందని వార్తలు వచ్చాయి. తీరా ఇప్పుడు అవన్నీ దూరమయ్యాయని మల్లు వుడ్ లో కథనాలు జోరుగా వస్తున్నాయి.మరి దీనిపై దర్శకుడు ఒమర్ లులు ఎందుకు స్పందించలేదో?