ఓటరు జాబితాలో మీ పేరు ఉందా, లేదా ?

ఓటరు జాబితాలో మీ పేరు ఉందా, లేదా ?

ఆంధ్రప్రదేశ్‌ ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోండి. అందుకు ఇంకా నాలుగు  రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఓటు లేని వారికి మార్చి 15లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ నెల 23న ఓటర్ల తుది జాబితాను వెల్లడిస్తారు.ఈ లోపే అర్హులందరూ జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలి.  ఈ నెల 15లోగా ఆన్‌లైన్‌, ఆఫ్‌  లైన్‌లో ఓటు నమోదు దరఖాస్తు చేసుకోవచ్చు.   ఓటరు గుర్తింపు కార్డులు లేకున్నాకేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని వెల్లడించారు. జాబితాలో పేరున్న వారందరికీ ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తారు. ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటరు గుర్తింపు కార్డు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్,పాన్ కార్డు, డ్రైవింగ్ లెసెన్స్,బ్యాంక్ పాస్‌బుక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు, ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ) జాబ్ కార్డు,జాతీయ జనాభా రిజిస్ట్రేషన్ కింద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డు, కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు,ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన అధీకృత ఫొటో ఓటరు స్లిప్ లలో ఏ ఒక గుర్తింపు పత్రాన్ని చూపించయినా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos