ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారమూ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40లకు సెన్సెక్స్ 314 పాయింట్ల లాభంతో 37,368 వద్ద, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 11,260 వద్ద ట్రేడయ్యాయి. వుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎన్టీపీసీ, ఇండియన్ బ్యాంకు, ఎస్బీఐ, టీసీఎస్, ఐటీసీ లిమిటెడ్, రిలయన్స్ ఇన్ఫ్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో ఉండగా, హెచ్డీఎఫ్సీ, భారతీ ఇన్ఫ్రా, భారత్ పెట్రోలియం, భారతీ ఎయిర్టెల్, అరబిందో ఫార్మా కంపెనీల షేర్లు నష్టాలతో కుంగాయి.డాలరుతో రూపాయి మారకం విలువ 69.63 గా నమోదైంది.