అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని పార్టీ కార్యకర్తలు అభిమానులకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళ వారం శుభా కాంక్షలు తెలిపారు. ‘మహానేత ఆశయాలను, పథకాలను సజీవంగా ఉంచేందుకు వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లు. గత ఎనిమిదేళ్లుగా ప్రజా జీవితంలో సవాళ్లు, కష్టాలు, నష్టాలకు ఎదురొడ్డి ఈ పార్టీని భుజ స్కందాల పై మోసిన ప్రతి కుటుంబ సభ్యుడికి శుభాకాంక్షలు, వందనాలు’ అని ట్వీట్ చేశారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల్ని ఎదిరించి వైకాపా స్థాపించారు. అప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ఊపిరిగా పోరాటాలు చేస్తూ తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఎదురొడ్డి ఆంధ్ర ప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ను బలమైన పార్టీగా తీర్చి దిద్దారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.