తెలంగాణలో ఎన్నికల సందడి

తెలంగాణలో ఎన్నికల సందడి

హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో తెలంగాణలోని
అన్ని రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. శాసన సభకు ఎన్నికలు జరిగిన నాలుగు నెలల వ్యవధిలోనే
లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఏప్రిల్‌ 11న రాష్ట్రంలో పోలింగ్‌ జరుగనుంది. మరో వైపు రాజకీయ
పార్టీలు హడావుడి సమావేశాలకు తెర లేపాయి. అధికార తెరాస పార్టీ అభ్యర్థుల ఎంపికపై సీఎం
కేసీఆర్‌ కసరత్తు ప్రారంభించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ లోక్‌సభ
నియోజకవర్గాల సమావేశాలను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులను
స్వీకరించి, ఢిల్లీకి పంపించింది. బీజేపీ కూడా ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలుగా ఉంది.
తెలుగు దేశం పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది. సీపీఐ, సీపీఎంలు పొత్తు దిశగా చర్చలు
సాగిస్తున్నాయి. సీపీఐ, తెదేపా మధ్య పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos