జగన్ ఎన్నికల సమర భేరి

జగన్ ఎన్నికల సమర భేరి

కాకినాడ : వైకాపా అధ్యక్షుడు వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి సోమవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా హాజరైన జన సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రజలు తనకు అధికారాన్ని అప్పగిస్తే అవినీతి లేని స్వచ్ఛమైన పాలనను అందిస్తానని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రాజన్న రాజ్యం రావాలని, కనుక ఒక్కసారి వైకాపాకు అవకాశం ఇవ్వాలని కోరారు. రుణ మాఫీ పేరిట చంద్రబాబు రైతులను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి పేరిట యువతను దగా చేశారన్నారు. అయిదేళ్ల చంద్రబాబు రాక్షస పాలనపై గ్రామాల్లో చర్చ జరగాలని అన్నారు. అవినీతిమయమైన తెదేపా పాలనలో చివరకు మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా పెద్ద ఎత్తున అవకవకలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos