లాభాల్లో స్టాక్ మార్కెట్

లాభాల్లో స్టాక్ మార్కెట్

ముంబయి: దేశీయ స్టాక్‌  మార్కెట్లో సూచీలు సోమవారం భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 380 పాయింట్లు ఎగబాకి ప్రతిష్టాత్మక 37 వేల మార్క్‌ను దాటగా, జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 133 పాయింట్లు లాభపడింది. ప్రారంభం నుంచే మార్కెట్లు లాభాల్ని గడించాయి. బ్యాంకింగ్‌, ఆటో మొబైల్‌, లోహ రంగాల షేర్లలో కొనుగోళ్ల వల్ల సూచీలు చురుగ్గా  మొదల య్యాయి. 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ ఆరంభించిన  సెన్సెక్స్‌ కడా వరకూ వెనక్కి  చూడలేదు. కొనుగోళ్లు అంత కంతకూ పెరిగి భారీ లాభాన్ని దక్కించుకుంది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 382 పాయింట్లు లాభపడి 37,054 వద్ద స్థిర పడింది. నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో 11,168 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.91గా కొనసా గింది. ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ గెలిచే అవకాశాలున్నట్లు అంచనాలతో దేశీయ మార్కెట్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయని  నిపుణులు భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos