న్యూఢిల్లీ : జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్‌తో విడుదలలో ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఉగ్రవాదుల చెరలోని ఇండియన్ ఎయిర్ లైన్స్ విమాన ప్రయాణికుల విముక్తి కి అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం మసూద్ అజర్‌ను అనివార్యంగా విడుదల చేసింది. ఈ వ్యవహారంలో అజిత్ దోవల్ ప్రమేయం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరిచింది. 1999లో మసూద్ అజర్ విడుదల సంప్రదింపులకు కాందహార్‌కు వెళ్లిన నలుగురు సభ్యులతో కూడిన సమితిలో అప్పటి కేంద్ర నిఘా విభాగం సీనియర్ అధికారి అజిత్ దోవల్ కూడా ఒకరు. అజర్ విడుదలను ఆయన వ్యతిరేకించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాందహార్‌లో విడుదల చేసిన ముగ్గురు ఉగ్రవాదుల వెంట అజిత్ దోవల్ ఉన్న ఫోటోలను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ చేయటం తెలిసిందే. పుల్వామా ఉగ్ర దాడిలో 40 మంది జవాన్ల ప్రాణాలు పోయేందుకు కారణమైన మసూద్ అజర్‌ను ఎవరు విడుదల చేశారో మృతుల కుటుంబాలకు చెప్పాలని ప్రధానిని డిమాండ్ చేశారు. మసూద్ అజర్‌తో పాటు ముగ్గురు ఉగ్రవాదులను పాకిస్తాన్‌కు అప్పగించేందుకు కాందహార్‌లో అజిత్ దోవల్ జరిపిన చర్చలు, ఒప్పందం తదితర వివరాలగురించి కూడా చెప్పాలని కోరారు.