శ్రీనగర్: పుల్వామా ఉగ్రదాడి సూత్రధారుల్లో మరొకరు ముదాసిర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్(23) త్రాల్‌లోని పింగ్లిష్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో హతమైనట్లు భావిస్తున్నా మని అధికారులు సోమవారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులకు తెలి పారు. నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సిబ్బంది ఆదివారం పింగ్లిష్ ప్రాంతంలో తనిఖీలు జరుపుతుండగా ఓ ఇంట్లో దాగి ఉన్న ముష్కరులు భద్రతా బలగాలపైకి కాల్పులకు దిగారు. దీంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను మట్టు బెట్టారు. మృత దేహాలు గుర్తు పట్ట లేని విధంగా ఛిద్రమయ్యాయని అధికారులు తెలిపారు. హతుల్లో ఒకరిని ముదాసిర్ అహ్మద్ ఖాన్‌గా పోలీసులు భావిస్తున్నారు. పుల్వామా దాడికి పేలుడు పదార్థాలను, వాహనాన్ని ఏర్పాటు చేసింది అహ్మద్ ఖానే. త్రాల్‌లోని మిర్ మొహల్లా ప్రాంతానికి చెందిన అహ్మద్ ఖాన్ డిగ్రీ పూర్తిచేసి, ఎలక్ట్రీషియన్‌గా ఐటీఐలో డిప్లొమా కోర్సు చేశాడు. అతివాద భావజాలానికి ప్రేరేపితుడై 2017లో జైషే మహ్మద్ లో చేరాడు. తొలుత క్షేత్ర స్థాయి కార్య కర్తగా పని చేసాడు. 2018 నుంచి జైషేలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాడు. పుల్వామా ఉగ్రదాడిలో ఆత్మాహుతి చేసుకున్న అదిల్ అహ్మద్ దార్‌తో దాడికి ముందు ఖాన్‌తో చాలా రోజుల పాటు సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది.