న్యూఢిల్లీ:సర్ఫ్ ఎక్సెల్ వాణిజ్య ప్రకటన సామాజిక మాధ్యమాల్లో విమర్శలకు గురైంది. మత సామర స్యాన్ని చాటి చెప్పటమూ ప్రకటన లక్ష్యమైనప్పటికీ ఆచరణ అందుకు భిన్నంగా ఉందనే వాదనలు వెల్లువెత్తాయి. సర్ఫ్‌ఎక్సెల్ ‘రంగ్ లాయే సంగ్‘ పేరిట హిందూ-ముస్లింల సామరస్య భావనను చూపిం చేందుకు ప్రయత్నించింది. తెల్లని టీ షర్టు ధరించిన హిందూ బాలిక సైకిల్ మీద తిరుగుతున్నపుడు మేడ మీద ఉన్న చిన్నారులు ఆమెపై రంగులు జల్లుతారు. తరువాత ఆ బాలిక తన ముస్లిం స్నేహి తుని దగ్గరకు వెళ్లి రంగులు అయిపోయాయి అని చెబుతుంది. దీంతో తెల్లని కుర్తా, పైజమా ధరించిన ఆ బాలుడు బయటకు వస్తాడు. ఆ బాలిక తన స్నేహితుణ్ణి సైకిల్ మీద మసీదు వరకూ తీసుకు వెళ్లి విడిచి పెడుతుంది. ఆ బాలుడు నమాజ్ అయ్యాక వస్తానని చెబుతాడు. వచ్చాక రంగు పడుతుందని బాలిక అన్నపుడు బాలుడు చిరునవ్వులు చిందిస్తాడు. ‘మరక మంచిదే’ అనే సందేశంతో ప్రకటన ముగు స్తుంది. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ ప్రకటనను ఇప్పటివరకూ ఎనభై లక్షల కంటే ఎక్కువ మంది చూసారు. మనం అన్ని మతాలను గౌరవిస్తాం, ఎవరినీ వ్యతిరేకించం. ఈ విషయంలో గంభీరంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ దుస్తులను ఉతికేందుకు వినియో గించిన విదేశీ సర్ఫ్‌ను ఇప్పుడు మనం ఉతకాల్సిన రోజు వచ్చినట్లుందనటం కొస మెరుపు.