ఎన్నికలకు మన్మోహన్ సింగ్ దూరం

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విముఖత చూపినట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు
తెలిపాయి. అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పంజాబు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు చేసిన వినతికి
సానుకూల స్పందన లభించలేదని తెలిసింది.  రెండు  మార్లు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్2009లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీకి  అవకాశం వచ్చినా అనారోగ్య కారణాలతో గోదాలోకి దిగ లేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అక్కడి నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ  పోటీ చేసి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతుల్లో ఓటమి చవిచూశారు. 2017లో అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికవడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది.  

తాజా సమాచారం

Latest Posts

Featured Videos