శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన నిరుత్సాహం నుంచి తేరుకొని లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి సోమవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గట్టి షాకిచ్చింది.గత ఏడాది డిశంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో తన అరెస్టును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఱలు చేశారు.దీనిపై విచారణ జరిపిన కోర్టు అరెస్ట్ అక్రమమని నిరూపించడానికి సరైన కారణాలు చూపలేదని పేర్కొంటూ పిటిషన్ కొట్టేసింది. జరిగిన తెలంగాణ రాష్ట్రశాసన సభ ఎన్నికల సమయంలో తన నియోజకవర్గమైన కొడంగల్‌లో కేసీఆర్ సభను అడ్డుకోవడానికి రేవంత్‌రెడ్డి సభ జరిగే రోజు కొడంగల్ బంద్‌కు పిలుపునిచ్చారు.దీంతో పోలీసులు అర్ధరాత్రి రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి సన్నిహితుడు వేం నరేందరరెడ్డి కోర్టులో హెబియస్ కార్సస్ పిటిషన్ కూడా దాఖలు చేశారు.దీనిపై పలుమార్లు విచారణ జరిపిన కోర్టు రేవంత్‌రెడ్డి అరెస్ట్ అక్రమమని కారణాలు చూపలేకపోవడంతో పిటిషన్ కొట్టేస్తున్నామంటూ తుదితీర్పు చెప్పింది. రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై విచారణకు హాజరైన వికారాబాద్ మాజీ ఎస్పీ అన్నపూర్ణ నేర విచారణ చట్టం కింద ముందస్తుగా ఆయనను అరెస్ట్ చేసినట్లు కోర్టుకు వివరించారు. సీఎం సభ కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.