తెలుగు సూపర్‌స్టార్
మహేశ్‌బాబు వరుసపెట్టి సినిమాలను లైన్‌లో పెట్టశాడు.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న
మహర్షి చిత్రం చిత్రీకరణ దాదాపుగా ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం.మహర్షి చిత్రాన్ని
మే9వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్‌రాజు అధికారికంగా ప్రకటించాడు.మహర్షి
పూర్తయిన వెంటనే ఆలస్యం చేయకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిత్రంలో నటించడానికి
మహేశ్ సిద్ధమవుతున్నాడు.ఈ చిత్రం కీలకపాత్రల కోసం అనిల్ రావిపూడి సీనియర్ నటీనటులను
సంప్రదించినట్లు సమాచారం.ఈ క్రమంలో ఒకప్పటి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతిని కూడా సంప్రదించినట్లు
సమాచారం.2006లో నాయుడమ్మ అనే చిత్రంలో చివరిగా నటించిన విజయశాంతి అనంతరం వెండి తెరకు
పూర్తిగా వీడ్కోలు పలికి రాజకీయాలపై దృష్టి సారించారు.12 ఏళ్ల అనంతరం విజయశాంతిని మరోసారి
వెండితెరపై నటింపచేయడానికి అనిల్ రావిపూడి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.అంతేకాకుండా
మహేశ్‌బాబు,విజయశాంతిలు తల్లీకొడుకులుగా మూడు దశాబ్దాల క్రితం కొడుకు దిద్దిన కాపురంలో
నటించారు.ఇక మిగిలిన కీలకపాత్రల కోసం కన్నడ హీరో ఉపేంద్రను కూడా సంప్రదించినట్లు సమాచారం.ఈ
చిత్రంలో మహేశ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించనుండగా ఈ చిత్రాన్ని కూడా దిల్‌రాజే నిర్మించనున్నట్లు
సమాచారం..