ఈ దుస్తులు మీ కోసమే వేసుకున్నా..

  • In Film
  • March 11, 2019
  • 179 Views
ఈ దుస్తులు మీ కోసమే వేసుకున్నా..

గత ఏడాది ధడక్‌ చిత్రంతో బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంటీ ఇచ్చిన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్‌ ఒకేఒక్క చిత్రంతో టాప్‌క్రేజీ సెలబ్రిటీగా మారిపోయింది.నటనలోనూ,అందంలోనూ శ్రీదేవికి ఏమాత్రం తీసిపోని జాహ్నవికి యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంది.జాహ్నవి కూడా తరచూ జిమ్‌కు వెళుతూ ఫిజిక్‌ను కాపాడుకుంటోంది.ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం జిమ్‌కు వెళుతుండగా గమనించిన కొంత మంది ఫోటోగ్రాఫర్లు ఫోటోలకు ఫోజులు ఇవ్వాలంటూ జాహ్నవిని కోరారు.ఈ సందర్భంగా జాహ్నవి సరదాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.ఫోటోలకు ఫోజులివ్వాలంటూ ఫోటోగ్రాఫర్లు కోరగా ‘నేను జిమ్‌ కోసం కంటే మీ కోసమే ఎక్కువగా రెడీ కావాల్సి వస్తోంది.మీ కోసమే ఇటువంటి దుస్తులు ధరించి వస్తున్నా’నని సరదాగా వ్యాఖ్యానించింది.అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos