ఆసుపత్రిలో వైద్యం
చేయించుకోవడానికి డబ్బులు లేక దీనస్థితిలో ఉన్న తనను ఆదుకునే నెపంతో లైంగికంగా వేధించినట్లు
బహుభాష నటి కన్నడ చిత్రరంగ నటుడిపై ఆరోపణలు చేశారు.కన్నడ,తెలుగు,తమిళం,మలయాళం భాషల్లో
పలు చిత్రాల్లో నటించిన విజయలక్ష్మీ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.అయితే
ఖరీదైన వైద్యం చేయించుకోవడానికి ఆర్థికపరిస్థితి సహకరించకపోవడంతో సహాయం చేయాలంటూ కన్నడ
చిత్రరంగ ప్రముఖులను అర్థించారు.ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం రవిప్రకాశ్ అనే నటుడు
ఆసుపత్రికి వెళ్లి విజయలక్ష్మీ వైద్యానికి రూ.1 లక్ష సహాయం చేశాడు.ఈ నెపంతో అప్పటి
నుంచి తరచూ ఆసుపత్రికి వస్తూ మాటలతో,చేష్టలతో పదేపదే అసభ్యకరమైన సందేశాలు పంపుతూ లైంగికంగా
వేధించాడంటూ విజయలక్ష్మీ ఆరోపించారు.అందుకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో విజయలక్ష్మీ
చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.విజయలక్ష్మీ చేస్తున్న ఆరోపణలను రవిప్రకాశ్ ఖండించాడు.విజయలక్ష్మీ
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు..