దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగనుంది. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సాయంత్రం 5 గంటలకు ప్రకటించనుంది. పోలింగ్ తేదీలు, ఎన్ని దశల్లో ఎన్నికల నిర్వహణ వివరాలను సీఈసీ సునీల్ అరోరా వెల్లడిస్తారు. సాయంత్రం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి రానుంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీఎన్నికలు జరగనున్నాయి.