అంబానీ ఇంట పెళ్లి సందడి

అంబానీ ఇంట పెళ్లి సందడి

ముంబాయి : రిలయన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధిపతి, ఆసియాలోనే అపర కుబేరుడుగా పేరు గాంచిన ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరుగనుంది. ప్రముఖ వజ్రాల కంపెనీ అధిపతి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా. ముంబాయిలోని ట్రిడెంట్ హోటల్లో వివాహ వేడుకలు జరుగుతాయి. పెళ్లి మండపాన్ని పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పేరు గడించిన పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటులు, ప్రముఖ రాజకీయ నాయకులు ఈ వివాహ మహోత్సవానికి హాజరవుతున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ దంపతులు కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. ఆకాశ్, శ్లోకాలు చిన్ననాటి స్నేహితులు. ధీరూభాయ్ అంబానీ స్కూల్లో చదువుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడడంతో గత ఏడాది జూన్లో వీరి నిశ్చితార్థం జరిగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos