వైకాపా ఎమ్మెల్యే అరెస్టు

వైకాపా ఎమ్మెల్యే అరెస్టు

నెల్లూరు : పోలీసుల విధులకు ఆటంకం కల్పించారనే ఆరోపణపై వైఎస్సార్సీపీకి చెందిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గురువారం రాత్రి తన అనుచరులను పోలీసుల చెర నుంచి విడిపించే ప్రయత్నంలో ఆయనపై వేదాయపాలెం పోలీసుస్టేషన్లో నాన్బెయిలబుల్ కేసు నమోదైంది. దీనిపై ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించి, పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద దీక్షకు దిగారు. కేసుకు సంబంధించి ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తన అనుచరులను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే గురువారం అర్ధ రాత్రి వేదాయపాలెం పోలీసు స్టేషన్‌సో సీఐ నరసింహారావుతో వాగ్వాదానికి దిగారు. ఇదే సందర్భంలో ఆయన పోలీసులపై దౌర్జన్యానికి ప్రయత్నించారనే ఆరోపణలూ వచ్చాయి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos