స్వామిని తాకని సూర్య కిరణాలు

స్వామిని తాకని సూర్య కిరణాలు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి పాదాలను
శనివారం సూర్య కిరణాలు తాకకపోవడంతో భక్తులు నిరాశ చెందారు. ఆకాశం మేఘావృత్తమై ఉండడంతో
కిరణాల జాడ అగుపించలేదు. ప్రతి ఏటా మార్చి 9, 10 తేదీల్లో, మళ్లీ అక్టోబరు 1, 2 తేదీల్లో
కిరణాలు ఆలయ పంచ ద్వారాలు దాటి గాలి గోపురం మధ్య నుంచి స్వామి పాదాలు తాకుతుంటాయి.
ఈ అద్భుత దృశ్యం కేవలం మూడు లేదా నాలుగు నిముషాలు మాత్రమే ఆవిష్కృతమవుతుంది. రేపు కిరణాలు
స్వామి పాదాలను తాకే అవకాశం ఉందని అర్చకులు చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos