ఆ రెండు నియోజకవర్గాలపై చినబాబు కన్ను..

ఆ రెండు నియోజకవర్గాలపై చినబాబు కన్ను..

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయ్యారంటూ రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల వైపు నుంచి కూడా విమర్శలు,ఆరోపణలు వినిపిస్తుండడంతో త్వరలో జరుగనున్న శాసనసభ పోరులో ప్రత్యక్షంగా తలపడడానికి తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ నిర్ణయించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలైన చిక్కు నియోజకవర్గం ఎంపిక రూపంలో ఎదురైంది.ఈసారి కూడా కుప్పం నుంచే పోటీ చేస్తామంటూ తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించడంతో లోకేశ్‌ సునాయాసంగా గెలిచే నియోజకవర్గం వేటలో పడ్డాడు.గతంలో కర్నూలు నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నా లోకేశ్‌ సమర్థత గురించి తెలిసిన చంద్రబాబు నిరకారించినట్లు తెదేపా వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో అనేక సమీక్షలు,సర్వేలు నిర్వహించిన అనంతరం గుంటూరు జిల్లా పెదకూరపాడు,విశాఖ దక్షిణం నియోజకవర్గం వైపు లోకేశ్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.గుంటూరు జిల్లా పెదకూరపాడులో 2009 – 2014లో వరుసగా టీడీపీ విజయం సాధించింది. ప్రస్తుతం కొమ్మాలపాటి శ్రీధర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం బలంగా ఉందని రాజకయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో మంగళగిరి పేరు కూడా వినిపించింది. దీంతో స్థానిక టీడీపీ నాయకులు సైతం ఇక్కడి నుంచే పోటీ చేయాలని లోకేష్ ను కోరారట..  మంగళగిరి చూట్టూ జరుగుతున్న అభివృద్ధి లోకేశ్కు భారీ మెజారిటీ తెస్తుందని విన్నవించారట..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos