చంద్రబాబుతో కౌశల్ భేటి..

చంద్రబాబుతో కౌశల్ భేటి..

బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌ విజేత కౌశల్‌ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును కలుసుకోవడం పలు ఆసక్తికర చర్చలకు దారి తీసింది.త్వరలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విశాఖ,అనకాపల్లి అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు జిల్లా ముఖ్యనేతలతో పాటు ఆయా నియోజకవర్గాల నేతలు,కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు.ఈ సమయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కౌశల్‌ను స్వయంగా చంద్రాబాబు వద్దకు తీసుకెళ్లారు.కొద్ది రోజుల క్రితం అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచిన తెదేపా నేత అవంతి శ్రీనివాస్‌ వైసీపీలో చేరడంతో అనకాపల్లి నుంచి అభ్యర్థి కోసం ప్రయత్నిస్తుండగా మంత్రి గంటా శ్రీనివాసరావు బిగ్‌బాస్‌ విజేత కౌశల్‌ పేరు ప్రస్తావించినట్లు సమాచారం.బిగ్‌బాస్‌ అనంతరం కౌశల్‌కు ప్రజల్లో వచ్చిన గుర్తింపు,అక్కడ సామాజికవర్గ సమీకరణాలు ఇవన్నీ కలిసొస్తాయంటూ గంటా శ్రీనివాసరావు చంద్రబాబుకు వివరించారట. కౌశల్‌ సైతం తెదేపాతో కలసి పని చేయడానికి సముఖత వ్యక్తం చేశారని ఎన్నికల్లో తెదేపాకు మద్దతుగా ప్రచారం చేయడానికి కూడా అంగీకరించారంటూ తెదేపా నేతలు తెలుపుతున్నారు. రాజకీయ,సామాజికవర్గ సమీకరణాలు,కౌశల్‌ సమర్థత పరిశీలించిన అనంతరం కౌశల్‌పై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.కాగా డేటా చోరీ కేసులో అటు చంద్రబాబు,కౌశల్‌ ఫౌండేషన్‌ నిధులు దుర్వనియోగం చేశారని,ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిందని, గిన్నిస్‌బుక్‌ ప్రతినిధులు కలిసారని ఇలా కౌశల్‌ చాలా అబద్దాలు చెప్పారంటూ ఇటు కౌశల్‌పై ఆరోపణలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు,కౌశల్‌ సమావేశమవడం ఆసక్తికరంగా మారింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos