మంత్రి ఫరూక్‌ ఓటు కూడా గల్లంతు

మంత్రి ఫరూక్‌ ఓటు కూడా గల్లంతు

నంద్యాల : ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా అయోమయంగా మారింది. జాబితాలో ఎవరి పేరుందో…ఎవరి పేరు తొలగిపోయిందో…అంతుబట్టడం లేదు. తాజాగా సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండీ. ఫరూక్‌ ఓటు కూడా గల్లంతైంది. తనదే కాదు తన కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లు కూడా ఓటర్ల జాబితాలో మాయమయ్యాయని ఫరూక్‌ వాపోయారు. ఆర్డీవోను అడిగితే, తనకేమీ తెలియదంటున్నారని చెప్పారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశానని తెలిపారు. తాను ఎనిమిది సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని, తన పేరే గల్లంతైతే, ఇక సామాన్యుల సంగతేమిటని ఆయన వాపోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos