సిట్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు

సిట్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు

అమరావతి: ఓటర్ల జాబితా నుంచి పేర్ల  తొలగింపులో అక్రమాల గురించి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో, తమకు సంబంధం లేదని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి గోపాల్‌ కృష్ణ ద్వివేది శుక్రవారం ఇక్కడ స్పష్టీకరించారు. ఫారం-7 ద్వారా ప్రత్యర్థుల ఓటర్ల పేర్లను  తొలగించే వ్యవహారాన్ని  తొలిసారిగా గుర్తించామన్నారు. గతంలో ఎన్నడూ  ఇలాంటి పరిస్థితి తలెత్త లేదన్నారు. ఫారం-7 పరిశీలనకే ఎన్నికల సిబ్బంది ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ద్వివేది వివరించారు.  మావోయిస్టు ప్రభావిత, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల పర్య వేక్షణకు రెండు హెలికాప్టర్లు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరామన్నారు.  ఈవీఎంలు మొరాయిస్తే పోలింగ్‌కు ఆటంకం లేకుండా  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.  ప్రతి నియోజక వర్గంలో 20 శాతం ఈవీఎంలు అదనంగా అందుబాటులో ఉంటాయనని వివరించారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos