మిజో గవర్నర్ రాజీనామా

మిజో గవర్నర్ రాజీనామా

న్యూ ఢిల్లీ: మిజోరాం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు. రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన కూడా ఈ మేరకు వెలువడింది. మరోవైపు, అసోం గవర్నర్ జగదీష్ ముఖికి మిజోరాం భాద్యతల్ని కూడా అప్పగించారు. మిజోరాంకు కొత్త గవర్నర్ నియమితులయ్యేంత వరకూ  జగదీష్ ఈ రాష్ట్ర వ్యవహారాల్ని కూడా పర్యవేక్షిం చనున్నారు. కార్యకర్తగా, ఇతర పదవుల్లో ఆర్‌ ఎస్‌ ఎస్ సంస్థకు చాలా కాలం సేవలందించిన రాజశేఖరన్ 2018 మే 25న మిజోరాం గవర్నర్ గా నియమితులయ్యారు.  వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన్ను భాజపా తిరువనంతపురం నియోజక వర్గం నుంచి బరిలోకి దించదలచినందున రాజశేఖరన్‌ గవర్నర్‌ పదవిని త్యజించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos